ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఉండవ్.. కేంద్రం

కరోనా కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారుతున్న దృష్ట్యా.. తమ వేతనాల్లో భారీగా కోత ఉండవచ్చునని భయపడుతున్న  ఉద్యోగులకు కేంద్రం భరోసా ఇచ్చింది. వారి వేతనాల్లో కోత ఉండదని, అలాగే పెన్షనర్ల పింఛనును ఆపాలనో, లేదా కోత విధించాలనో ప్రతిపాదన కూడా లేదని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వచ్ఛే ఏడాది లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరానికి యూపీఎస్ ఎస్ సీ పరీక్షలను వాయిదా వేశామని, […]

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఉండవ్.. కేంద్రం

Edited By:

Updated on: Apr 19, 2020 | 7:51 PM

కరోనా కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారుతున్న దృష్ట్యా.. తమ వేతనాల్లో భారీగా కోత ఉండవచ్చునని భయపడుతున్న  ఉద్యోగులకు కేంద్రం భరోసా ఇచ్చింది. వారి వేతనాల్లో కోత ఉండదని, అలాగే పెన్షనర్ల పింఛనును ఆపాలనో, లేదా కోత విధించాలనో ప్రతిపాదన కూడా లేదని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వచ్ఛే ఏడాది లక్ష ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరానికి యూపీఎస్ ఎస్ సీ పరీక్షలను వాయిదా వేశామని, అంతే తప్ప రద్దు చేయలేదని అన్నారు. మే 3 అనంతరం సవరించిన పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఆయన వివరించారు.