ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కి కరోనా లేదు.. ఆయనకు నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే మంగళవారం కరోనా వైరస్ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అంతకు ముందు ఆప్ ఎమ్మెల్యే రాఘవ చధ్ధా మీడియాతో మాట్లాడుతూ.. సత్యేంద్ర జైన్ తో తాను కొన్ని నిముషాలు మాట్లాడానని, అయన శ్వాస రేటు నిలకడగా ఉందని తెలిపారు. 42 వేలకు పైగా కరోనా కేసులతో ఢిల్లీ నగరం.. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత అత్యధిక కేసులను నమోదు చేసుకుంది.