‘కరోనా‌’ జన్యుక్రమంలో మార్పులు.. పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్‌

| Edited By:

Jul 04, 2020 | 9:13 AM

కోవిడ్‌ కారక 'సార్స్‌ కోవ్‌ 2' వైరస్‌ జన్యు క్రమంలో మార్పు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా‌ జన్యుక్రమంలో మార్పులు.. పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్‌
Follow us on

కోవిడ్‌ కారక ‘సార్స్‌ కోవ్‌ 2’ వైరస్‌ జన్యు క్రమంలో మార్పు జరిగిందని, దీంతో డీ614జీ అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కొత్త వైరస్‌ వలన మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాల్లో ఈ కొత్త రకం ఎక్కువ ఎఫెక్ట్‌ చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ వైరస్‌కి సంక్రమణ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వారు అన్నారు.

డీ614జీ వైరస్‌ గురించి ఏప్రిల్‌ మొదటివారంలో మాకు తెలిసింది. స్థానిక రకం కరోనా వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో డీ614జీ రకం ప్రవేశంతో పరిస్థితి తారుమారు అవుతోంది. ఇప్పుడున్న వైరస్‌ రకాల్లో డీ614జీ ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది అని బెటె కోర్బర్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ రకం వైరస్‌లో చాలా స్వల్పమైన మార్పు ఉందని, అది చాలా సమర్థమైందని ఆయన పేర్కొన్నారు. మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు దోహదపడుతున్న స్పైక్‌ ప్రొటీన్‌ డీ614జీలో ప్రభావవంతంగా మార్పు చెందడమే దీనికి కారణమని చెప్పారు. శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్‌ భారీ స్థాయిలో ఉంటుందని.. దీని వల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ వైరస్‌కి సంబంధించి మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.