వెబ్‌ సిరీస్‌ ఆలోచనలో నేచురల్ స్టార్

| Edited By:

Aug 25, 2020 | 3:07 PM

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరోవైపు ప్రొడ్యూసర్‌గా హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే తన నిర్మాణంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'హిట్'‌.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని..

వెబ్‌ సిరీస్‌ ఆలోచనలో నేచురల్ స్టార్
Follow us on

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరోవైపు ప్రొడ్యూసర్‌గా హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే తన నిర్మాణంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘హిట్’‌.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తానేమీ తీసిపోనని రుజువు చేసుకున్నాడు నాని. కాగా ఈ హిట్ సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఉన్న ఈ కరోనా టైంలో చిత్ర పరిశ్రమకు చాలా నష్టం వచ్చింది. గత కొద్ది నెలలుగా థియేటర్స్‌ మూత పడటంతో.. స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలో విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెజాన్, నెట్‌ ఫ్లిక్స్, ఆహా వంటి యాప్‌ల రాకతో వెబ్‌ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో చాలా మంది వెబ్‌ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పుడు నాని కూడా అదే ఆలోచనలో ఉన్నారట. అయితే వెబ్‌ సిరీస్‌లో నటించడానికి కాదు.. నిర్మించడానికి. కొన్ని రోజుల్లో ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నాడట నాని. ఇందుకు సంబంధించి టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం నాని, సుధీర్ బాబు కలిసి నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Read More:

తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!