కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదేనని.. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. కరోనా సైకిల్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ఇదే పరిష్కారమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని.. ఇదే తన సందేశమని పేర్కొన్నారు. ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రధానిగా చెప్పడం లేదని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చెప్తున్నానని పేర్కొన్నారు.