కరోనా వైరస్ చికిత్సలో భాగంగా వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూపు తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్లను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. కేవలం 33 రూపాయలకే ఒక ట్యాబ్లెట్‌ను ప్రజలకు అందజేస్తుంది. ఇంత వరకు దాదాపు 10 కంపెనీలు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. వీటన్నింటిలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ట్యాబ్లెట్ ధరే తక్కువ. ఫావిలో అనే బ్రాండు పేరుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసినట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వెల్లడించింది.
కాగా సొంత పరిశోధన, అభివృద్ధి ద్వారా ఈ ఔషధం ఏపీఐతో పాటు, ఫార్ములేషన్‌ను ఆవిష్కరించినట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఛైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన మందులను అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కరోనా చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ ట్యాబ్లెట్లను కూడా ప్రవేశ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక ప్రస్తుతం తీసుకువచ్చిన ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు అదనంగా త్వరలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను కూడా తీసుకురానున్నట్లు ఎండీ వెల్లడించారు.
Also Read:
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు