గొడుగులతో భౌతిక దూరం.

|

May 26, 2020 | 12:21 PM

కరోనా కట్టడికి రోజుకో నిబంధన..పూటకో సూచనలు వింటున్నాం. మాస్క్‌లు ధరించాలని..భౌతిక దూరం పాటించాలని.. శానిటైజర్స్‌ వాడాలని ఇలా చాలా చేస్తున్నాం.

గొడుగులతో భౌతిక దూరం.
Follow us on

కరోనా కట్టడికి రోజుకో నిబంధన..పూటకో సూచనలు వింటున్నాం. మాస్క్‌లు ధరించాలని..భౌతిక దూరం పాటించాలని.. శానిటైజర్స్‌ వాడాలని ఇలా చాలా చేస్తున్నాం. కానీ వైరస్‌ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు కర్నాటక రాయ్‌బరేలి ఎమ్మెల్యే రాజేష్‌ మిశ్రా.

భౌతిక దూరం పాటించేందుకు వినూత్న ప్రచారం ప్రారంభించారు. గొడుగులతో భౌతిక దూరం పాటించొచ్చని క్యాంపెయిన్‌ చేస్తున్నారు. అంతేకాదు. నగరంలో వెయ్యి గొడుగులను పంచి పెట్టిన రాజేష్‌ మిశ్రా.. గొడుగులతో వాకింగ్‌ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గొడుగులను వాడి భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. మందే లేని ఈ మహమ్మారితో కలిసి జీవించాల్సిందేనని.. అందుకే వ్యాక్సిన్‌ వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.