పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందించిన కేటీఆర్‌

|

Jul 06, 2020 | 9:47 PM

గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఎంట‌మాల‌జీ సిబ్బంది, డీఆర్ఎఫ్ వ‌ర్క‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ పీపీఈ కిట్ల‌ను అంద‌జేశారు. పారిశుద్ధ్య‌, ఎంటమాల‌జీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.. క‌రోనా నియంత్ర‌ణ కోసం చేస్తున్న కృషిని మంత్రి ప్ర‌శంసించారు.

పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందించిన కేటీఆర్‌
Follow us on

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. పారిశుద్ధ్య‌, ఎంట‌మాల‌జీ, డీఆర్ఎఫ్ సిబ్బందికి రాష్ర్ట ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఎంట‌మాల‌జీ సిబ్బంది, డీఆర్ఎఫ్ వ‌ర్క‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ పీపీఈ కిట్ల‌ను అంద‌జేశారు. పారిశుద్ధ్య‌, ఎంటమాల‌జీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.. క‌రోనా నియంత్ర‌ణ కోసం చేస్తున్న కృషిని మంత్రి ప్ర‌శంసించారు. విధుల్లో ఉన్న‌ప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా కిట్లు ధ‌రించాల‌ని సూచించారు మంత్రి కేటీఆర్.

గ్రేటర్ పరిధిలోని 22 వేల పారిశుద్ధ్య కార్మికులు, 2,500ల ఎంట‌మాల‌జీ సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు పీపీఈ కిట్లను సమకూర్చింది. పీపీఈ కిట్ల కోసం రూ. 13 కోట్లు ఖ‌ర్చు చేసిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్ర‌తి కిట్ విలువ రూ. 6,710. కాగా ఈ కిట్ లో 56 మాస్కులు, రెండు జ‌త‌ల గ్లౌసులు, శానిటైజ‌ర్ బాటిల్, ఆరు లీట‌ర్ల కొబ్బ‌రి నూనె, 36 స‌బ్బులు, ఒక ట‌వ‌ల్, ఒక జ‌త బూట్లు, ఒక టోపీ, రెయిన్ కోట్, జీహెచ్ఎంసీ జాకెట్ ఉన్నాయి.