Manmohan Singh tests positive : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స

|

Apr 19, 2021 | 7:42 PM

Manmohan Singh tests positive : రెండో దశలో కరోనా మహమ్మారి భారతదేశంలో కరాళ నృత్యం చేస్తోంది...

Manmohan Singh tests positive : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స
Manmohan
Follow us on

Manmohan Singh tests positive : రెండో దశలో కరోనా మహమ్మారి భారతదేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్ వైరస్ దేశంలోని మహామహా ప్రముఖులకు కూడా సోకుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా, అటు, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. దీంతో మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీల కతీతంగా వివిధ పార్టీల కీలకనేతలు తమ సందేశాలిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలని తమ తమ ఆకాంక్షలను వివిధ రూపాల్లో సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా, కోవిడ్ నియంత్రణ ఇలా చేయొచ్చంటూ కేంద్రానికి మన్మోహన్ పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని మన్మోహన్ తన సూత్రాల ద్వారా పేర్కొన్నారు.

ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు. కాగా, మన్మోహన్ కరోనాను జయించి త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, చిదంబరం వ్యక్తం చేయగా, అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా అనేక మంది నేతలు మన్మోహన్ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.