కరోనా పాజిటివ్..భయంతో సొంతూరు వెళ్లి ఆత్మహత్య..

|

Jul 22, 2020 | 12:38 PM

కరోనా పట్ల ప్రజలు అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ..పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ పాటిస్తూ...

కరోనా పాజిటివ్..భయంతో సొంతూరు వెళ్లి ఆత్మహత్య..
Follow us on

కరోనా పట్ల ప్రజలు అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. కరోనా బారినపడ్డ వారందరూ చనిపోతారనేది కేవలం అపోహ మాత్రమేనని, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ, యోగా, ప్రాణాయామం వంటివి పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ..పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ పాటిస్తూ…కరోనాను సులువుగా జయించవచ్చాని చెబుతున్నారు. అయినప్పటికీ, కరోనా సోకిందనే ఆందోళనలో కొందరు అభాగ్యులు మాత్రం ప్రాణాలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్ తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోతే జనార్దన్ రెడ్డి కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. ఈ క్రమంలోనే వైరస్ లక్షణాలు కనిపించటంతో మంగళవారం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా సొంతూరు బయల్దేరి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో మడిపల్లి చేరుకున్నాడు.

అయితే, కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి మడిపల్లి చేరుకున్నాడని తెలుసుకున్న ఎస్సై, తహసిల్దార్.. గ్రామానికి వెళ్లి.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అతడికి సూచించారు. కానీ, మరుసటి రోజు ఉదయాన్నే అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.