Omicron Latest News: దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న కొత్త వేరియంట్.. దాదాపు సగం మన పక్క రాష్ట్రంలోనే..

దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణ. దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న కొత్త వేరియంట్. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో.. దాదాపు సగం ఒక్క మహారాష్ట్ర రాష్ట్రలోనే రికార్డవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు..

Omicron Latest News: దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న కొత్త వేరియంట్.. దాదాపు సగం మన పక్క రాష్ట్రంలోనే..

Updated on: Dec 30, 2021 | 10:11 PM

దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణ. దేశం మొత్తాన్ని చుట్టేస్తున్న కొత్త వేరియంట్. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో.. దాదాపు సగం ఒక్క మహారాష్ట్ర రాష్ట్రలోనే రికార్డవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వెయ్యి మార్క్‌ను దాటిపోయాయి. ఇవాళ ఒక్కరోజే 229 ఒమిక్రాన్‌ కొత్త కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇందులో 198 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. ఓవరాల్‌గా అక్కడ 450 కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. దీంతో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతిని ఎలా కంట్రోల్‌ చేయాలి..

ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలనే అంశంపై మహా సర్కార్‌ ఫోకస్‌ చేస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా.. యుద్ధ ప్రాతిపదికన వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అంశంపై దృష్టి సారించింది. ఇటు తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే 67కి చేరాయి.

ఇవి కూడా చదవండి: Egg Kebab Recipe: మీకు ఎగ్ అంటే ఇష్టమా.. న్యూ ఇయర్ వేడుకల కోసం అదిరిపోయే రెసిపీ..

Somu Veerraju: దేశ ద్రోహులపేర్లను తొలిగించండి.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us