మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 10,333 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,91,440కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,32,277 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.44 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 14 వేల మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఇప్పటి వరకు ముంబై నగరంలో నమోదయ్యేవి. అయితే అనూహ్యంగా ముంబై నగరంలో కరోనా టెస్టులు పెంచడంతో.. క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో ఏడు వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
7,717 fresh #COVID19 cases, 10,333 discharges and 282 deaths reported in the state today.
Total number of positive cases is now 3,91,440 including 2,32,277 discharged,14,165 deaths and 1,44,694 active cases. Recovery rate is 59.34%: Mahrashtra Health Department pic.twitter.com/mvLJCkeWW5
— ANI (@ANI) July 28, 2020