COVID19 cases : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే మహారాష్ట్రలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో కంటే కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతే కాదు 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
కేవలం 24 గంటల్లో… శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కొత్తగా 3,081 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,90,759కు చేరింది. మరణాల సంఖ్య 50,738కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 2,342 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,86,469కు చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,653 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
Maharashtra reports 3081 new #COVID19 cases, 2342 discharges, and 50 deaths today
Total cases – 19,90,759
Total recoveries – 18,86,469
Death toll – 50,738Active cases – 52,653
— ANI (@ANI) January 17, 2021