మహా “విలయం”.. ఒకే రోజు 97 మంది మృతి

|

May 27, 2020 | 9:55 AM

మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం(26మే)ఒక్కరోజే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 97 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ వెల్లడించారు. భారత్‌లో ఒక్కరోజులో ఇంత మంది ఒక్క రాష్ట్రంలో కరోనా వల్ల మరణించడం ఇదే మొదటిసారి కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 97 మరణాల్లో 39 […]

మహా విలయం.. ఒకే రోజు 97 మంది మృతి
Follow us on

మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం(26మే)ఒక్కరోజే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 97 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ వెల్లడించారు.

భారత్‌లో ఒక్కరోజులో ఇంత మంది ఒక్క రాష్ట్రంలో కరోనా వల్ల మరణించడం ఇదే మొదటిసారి కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 97 మరణాల్లో 39 మరణాలు ముంబైలోనే నమోదు కావడం మరో విశేషం.

మహారాష్ట్రలో మంగళవారం (మే26) ఒక్కరోజే 2,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 1,002 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,758కి చేరింది. మరణాల సంఖ్య 1,792కు చేరింది. ఈ 1,792 మరణాల్లో ముంబైలోనే 1,065 మరణాలు నమోదు కావడం గమనార్హం.