మహారాష్ట్ర పోలీసులను వెంటాడుతున్న కరోనా

|

May 23, 2020 | 2:25 PM

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లక్షా 25వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ప్రస్తుతం 69వేల 595 యాక్టివ్‌ కేసులున్నాయి. ఒక్కరోజులోనే 6654 కేసులు..137 మరణాలు రికార్డయ్యాయి. మరోవైపు 24 గంటల్లో 14 మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్ర పోలీసులను వెంటాడుతున్న కరోనా
Follow us on

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లక్షా 25వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ప్రస్తుతం 69వేల 595 యాక్టివ్‌ కేసులున్నాయి. ఒక్కరోజులోనే 6654 కేసులు..137 మరణాలు రికార్డయ్యాయి. మరోవైపు 24 గంటల్లో 14 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.97శాతంగా ఉంది. ఇప్పటివరకు 50వేల మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,583కు పెరిగింది.

మహారాష్ట్రలో వైరస్‌ విలయ తాండవం కొనసాగుతోంది. 50వేలకు చేరువవుతున్నాయి పాజిటివ్‌ కేసులు. ఒక్క ముంబైలోనే 27వేల కేసులు నమోదయ్యాయి. కొత్తగా అక్కడ 2,345 కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. విధి నిర్వ‌హణ‌లో భాగంగా పోలీసులు కూడా కరోనా కార‌ణంగా మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 1666 మంది పోలీసుల‌కి క‌రోనా సోక‌గా, 18 మంది మ‌ర‌ణించారు. ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ నిర్వ‌హిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైర‌స్ ధాటికి మ‌ర‌ణించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరం బిర్ సింగ్ వెల్లడించారు. అరుఫడ్డారే గత కొద్ది రోజులుగా సెలువులో ఉన్నారని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వారి కుటుంబానికి ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టించారు. వ‌రుస‌గా పోలీసులు వైర‌స్‌కు బ‌లికావ‌డం ప‌ట్ల రాష్ట్ర డీజీపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.