కరోనాపై పోరు.. ప్లాస్మా థెరపీతో మరో ప్రయోగం..

|

Apr 23, 2020 | 1:49 PM

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌.. కరోనా పేషెంట్లకు ఇప్పుడు ఇది ఒక ఆశాదీపం. వైరస్‌ వచ్చి బాగా సీరియస్‌ అయిన పేషంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందన్నది డాక్టర్ల మాట. మన దగ్గరే కాదు బయట దేశాలలోనూ ఈ ట్రీట్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు.

కరోనాపై పోరు.. ప్లాస్మా థెరపీతో మరో ప్రయోగం..
Follow us on

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌.. కరోనా పేషెంట్లకు ఇప్పుడు ఇది ఒక ఆశాదీపం. వైరస్‌ వచ్చి బాగా సీరియస్‌ అయిన పేషంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందన్నది డాక్టర్ల మాట. మన దగ్గరే కాదు బయట దేశాలలోనూ ఈ ట్రీట్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. కేరళలో సైతం ఈ ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ పేషెంట్‌పై ప్రయోగాత్మకంగా అమలుచేసి విజయవంతమయ్యారు. మాక్స్ ఆస్పత్రి వైద్యులు ప్లాస్మా థెరపీ చేయడంతో కోవిడ్ రోగి కోలుకున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ ప్లాస్లా థెరపీ చికిత్సకు భారత వైద్య పరిశోధనా మండలి అనుమతిచ్చింది.

త్వరలోనే ఇక్కడ ప్లాస్మా థెరపీ విధానంలో ఎంపిక చేసిన రోగులకు చికిత్స అందించనున్నారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీబాడీ (ప్రతిరక్షకం)లు ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్ల రక్తకణాలు గుర్తించేందుకు రోగ నిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారుచేస్తుంది. అవి వైరస్ కణాలకు అతుక్కున్న తర్వాత వైరస్ కణాలను తెల్ల రక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి.

అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కిస్తారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. మిగతా రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ఒక దాత నుంచి 800 మిల్లిలీటర్ల వరకు ప్లాస్మా తీయవచ్చు. అయితే ఒక్కో కరోనా రోగికి 200 మిల్లీలీటర్ల ప్లాస్మా అవసరం పడుతుంది. అలా ఒక్క వ్యక్తి ద్వారా నలుగురు కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. మొట్టమొదటగా ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేసిన ప్లాస్మా థెరపీ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు మహారాష్ట్రలోనూ చేయనున్నారు. అక్కడ కూడా విజయవంతమైతే.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశముంది.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..

గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం కట్.. సీఎం కీలక నిర్ణయం..