అక్కడి జైలులో ఉన్నది 300 మంది..50 కరోనా కేసులు

మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. అటు ధారవిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం ముంబయివాసులకు కాస్తా ఊరటనిస్తోంది. ఇదిలా ఉంటే,..

అక్కడి జైలులో ఉన్నది 300 మంది..50 కరోనా కేసులు

Updated on: Jul 01, 2020 | 12:59 PM

మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తగా 4,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,761కి చేరుకుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 75,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. అటు ధారవిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం ముంబయివాసులకు కాస్తా ఊరటనిస్తోంది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలోని అకోలా జిల్లా జైలులో 50 మంది ఖైదీలు, మరో 28 మంది ఆదివారం కరోనా బారినపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అకోలా జిల్లా జైలులో ప్రస్తుతం దాదాపు 300 మంది ఖైదీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవల ఈ జైలులోకి కొత్త వారిని తీసుకోలేదన్నారు. ఆదివారం జైలులోని 50 మంది పురుష ఖైదీలతోపాటు మరో 28 మందికి కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తెలిపింది. తాజా కేసులతో కలుపుకుని జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,498కి పెరిగింది. కాగా, ఈ నెల 24న జిల్లా జైలులో 18 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 76 మంది మరణించారు. ప్రస్తుతం అకోలా జిల్లాలో 378 యాక్టివ్ కేసులు ఉండగా, 1000 మందికిపైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.