ప్రేమ..పెళ్లి.. ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకుంది... నమ్ముకున్నోడితో కలిసి నడిచింది. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. చివరకి అతడితో జీవించలేను అని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని నాయకనగర్‌కు చెందిన సమీనాభాను, నేరేడ్‌మెట్‌కు చెందిన సాయిచరణ్‌ ప్రేమించుకున్నారు....

ప్రేమ..పెళ్లి.. ఆత్మహత్య

Updated on: Jun 05, 2020 | 5:39 PM

ప్రేమించి పెళ్లి చేసుకుంది… నమ్ముకున్నోడితో కలిసి నడిచింది. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇక అతడితో జీవించలేను అని ఆత్మహత్య చేసుకుంది.హైదరాబాద్‌లోని నాయకనగర్‌కు చెందిన సమీనాభాను, నేరేడ్‌మెట్‌కు చెందిన సాయిచరణ్‌ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా వీరు వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి కూడా.. ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్‌ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించటం మొదలు పెట్టాడు. కన్నింటివారిని… అత్తంటివారిని వదలి విడిగా ఉంటున్నవీరికి… నా అనేవారు లేకుండా పోయారు. తమ ఇంటి సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడింది సమీనాభాను. చివరికి  సాయిచరణ్‌తో విసిగిపోయింది. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారటంతో తనకు చావే పరిష్కారం అని భావించింది. చివరికి తన సోదరి మెహ్రాభానుకు ఫోన్‌ చేసి సూసైడ్‌ చేసుకుంటున్నట్లు చెప్పింది. సోదరి మెహ్రాభాను అక్కడికి చేరుకునేలోగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది సమీనా. ఇది గమనించి సమీనాను ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని పిలిపించి చూపించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు తెలిపారు. సమీనాభాను మృతికి సాయిచరణ కారణమని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us