AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kothimeera Kobbari Pachadi: కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!

 భోజనంలో వేడివేడి అన్నంలోకి ఒక్క ముద్దయినా కమ్మటి పచ్చడి తగిలితే ఆ సంతృప్తే వేరు. సాధారణంగా కొత్తిమీరను మనం కూరల్లో గార్నిష్ కోసమే వాడుతుంటాం. కానీ తాజా కొత్తిమీరను ప్రధానంగా తీసుకుని, దానికి పచ్చి కొబ్బరి తీపి, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం జోడించి పచ్చడి నూరితే.. ఆ సువాసన, రుచి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటాయి. కొత్తిమీర వల్ల కంటి చూపు మెరుగవడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎంతో తక్కువ నూనెతో, పల్లెటూరి పద్ధతిలో ఐదే నిమిషాల్లో చేసుకునే ఈ కొత్తిమీర-పచ్చి కొబ్బరి రోటి పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

Phani CH
|

Updated on: Sep 05, 2026 | 8:20 PM

Share
కావలసిన పదార్థాలు:  శుభ్రంగా కడిగి తరిగిన  రెండు కట్టల తాజా కొత్తిమీర, అర చెక్క - సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుండి 15 పచ్చిమిరపకాయలు. ఒక చిన్న రెబ్బల చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర,  4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ మరియు తాలింపుకు సరిపడా నూనె.

1 / 5
తయారీ విధానం: రెండు కట్టల తాజా కొత్తిమీరను తీసుకుని వేర్లను కట్ చేసి, ఇసుక ఏమీ లేకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తడి ఆరబెట్టి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 

2 / 5
స్టవ్ వెలిగించి కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక చిన్న రెబ్బ చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి చిన్న మంటపై మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

3 / 5
ఇప్పుడు అదే కడాయిలో అదనంగా నూనె వేయనవసరం లేకుండా, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి పచ్చివాసన పోయేలా రెండు నిమిషాలు మగ్గించి చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీ జార్‌లో వేయించి చల్లార్చుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత అందులోనే మగ్గించిన కొత్తిమీరను కూడా వేసి నీళ్లు ఎక్కువగా పోయకుండా ఒకటి రెండు సార్లు పల్స్ మోడ్‌లో రోటి పచ్చడిలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

4 / 5
మళ్లీ చిన్న కడాయి పెట్టి ఒకటిన్నర స్పూన్ నూనె వేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ పొడి వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించి పచ్చడిలో కలపాలి. అంతే, నోరూరించే కొత్తిమీర కొబ్బరి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలిపి తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, చపాతీలతో నంజుకున్నా ప్రతి ముద్దా అమృతంలా అనిపిస్తుంది!

5 / 5
Follow Us
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!

టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్

కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..

ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా

అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!

తెలివిగా కొట్టేశారు.. అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యారు

దులీప్ ట్రోఫీ ఫైనల్ వేళ వైభవ్ సూర్యవంశీకి గంగూలీ స్పెషల్ గిఫ్ట్

ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక భేటీ..