‘విమాన సర్వీసులు ఇప్పుడే వద్దు’.. ‘మహా’ సీఎం ఉధ్ధవ్ థాక్రే

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 5:00 PM

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మరింత పెరగవచ్ఛునని భావిస్తున్నామని, బహుశా ఈ నెల 31 వ తేదీన కూడా లాక్ డౌన్ ఎత్తివేయకపొవచ్చునని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే అన్నారు.

విమాన సర్వీసులు ఇప్పుడే వద్దు.. మహా సీఎం ఉధ్ధవ్ థాక్రే
Follow us on

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మరింత పెరగవచ్ఛునని భావిస్తున్నామని, బహుశా ఈ నెల 31 వ తేదీన కూడా లాక్ డౌన్ ఎత్తివేయకపొవచ్చునని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే అన్నారు. ఈ కారణంగా దేశీయ విమానాల పునరుధ్దరణకు తాము ఇప్పుడే సిధ్దంగా లేమని ఆయన చెప్పారు. నేను పౌర విమాన యాన శాఖ మంత్రితో కూడా ఇదే విషయమై ఫోన్ లో మాట్లాడాను. విమాన సర్వీసుల ఆవశ్యకత గురించి నాకు తెలుసు. కానీ మాకు మరింత సమయం కావాలని ఆయనను కోరాను అని ఉద్దవ్ చెప్పారు. రానున్న 15 రోజులూ చాలా కీలకమైనవని, ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే…. ప్రజల రద్దీ పెరిగే సూచనలున్న దృష్ట్యా.. కరోనా కేసులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదని, వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తమ రాష్ట్రంలో 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లాక్ డౌన్ ని మొదట దశల వారీగా ఎత్తివేయవలసి ఉంది.. అయితే మొదట కరోనా కేసులు తగ్గాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు.