పశ్చిమబెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అనేకమంది మెడికల్ టూరిస్టులు రాష్ట్రానికి వస్తుంటారని, ఇన్ ఫ్రాప్రాజెక్టుల కోసం వస్తున్న వారిని తాము ఆపలేమని ఆమె చెప్పారు. కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల ప్రజలు బక్రీద్ వంటి పండుగలను జరుపుకోవచ్చునన్నారు. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలను ఇప్పట్లో ప్రారంభించే ఉద్దేశం లేదని, అవి మూసే ఉంటాయని ఆమె అన్నారు. ఎనిమిది జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు మమత తెలిపారు. కాగా…. నిన్నటివరకు ఈ రాష్ట్రంలో 60 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.