Coronavirus: సెగలు పుట్టిస్తోన్న సెకండ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కరోనా కలవరం.. తాజా పరిస్థితి ఇది..

|

Apr 17, 2021 | 6:43 AM

సెకండ్‌ వేవ్‌ సెగపుట్టిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ను మరింత వణికించేలా చేస్తోంది. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలవరం నెలకొంది. ఇటీవల పాజిటివ్‌తో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందగా....

Coronavirus: సెగలు పుట్టిస్తోన్న సెకండ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కరోనా కలవరం.. తాజా పరిస్థితి ఇది..
Corona Virus
Follow us on

సెకండ్‌ వేవ్‌ సెగపుట్టిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ను మరింత వణికించేలా చేస్తోంది. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలవరం నెలకొంది. ఇటీవల పాజిటివ్‌తో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందగా 12 మందికి వైరస్‌ సోకింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో మిగతా ఉద్యోగులు వణికిపోతున్నారు. కోవిడ్‌ విజృంభిస్తున్న క్రమంలో ఉద్యోగాలు చేయడాన్ని సవాల్‌గా భావిస్తున్నారు. కరోనా నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసి జీతంతో కూడిన సెలవులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న వారికి కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. బస్సులను కూడా శానిటైజ్‌ చేయడం లేదంటున్నారు.

అటు.. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు ఉపయోగించే సర్జికల్‌ ఐటమ్స్‌, మందులను బ్లాక్‌ చేయడాన్ని మంచిర్యాల పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా కేంద్రంగా పలు సర్జికల్‌ షాపులు, మెడికల్‌ ఏజెన్సీలలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా మందులను బ్లాక్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. కరోనా కిట్స్‌ను అందుబాటులో ఉంచేలా చూడాలని మెడికల్‌ షాపులకు సూచించారు. మరోవైపు.. ఆదిలాబాద్‌ పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో… సరిహద్దు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ స్టేట్‌ నుంచి రాకపోకలు సాగించే వారితో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. టెస్టులు నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించేలా చూడడంతో పాటు.. ఎవరికైనా టెంపరేచర్‌ ఉన్నట్టు గుర్తిస్తే వారిని వెంటనే రిమ్స్‌కు తరలించి చికిత్స అందించేలా చూస్తున్నారు.

Also Read: ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి.. అమెరికాను కోరిన ‘సీరం’ సీఈఓ అదర్‌ పూనావాలా

కొత్తగా కారు కొనే వారికి అదిరిపోయే బంపరాఫర్.. ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు!