తెల్ల‌గుర్రంపై క‌రోనా..! క‌ర్నూలులో సంచ‌ల‌నం

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు రేపిన ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నిజాముద్దీన్ మర్కజ్ పరిణామాలతో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడమే కాదు.. అన్ని శాఖలను కుదిపేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మర్కజ్ ఘటనతో ఉలిక్కి పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు చేప‌ట్టిన అవ‌గాహ‌న […]

తెల్ల‌గుర్రంపై క‌రోనా..! క‌ర్నూలులో సంచ‌ల‌నం

Updated on: Apr 01, 2020 | 11:42 AM

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు రేపిన ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి. నిజాముద్దీన్ మర్కజ్ పరిణామాలతో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడమే కాదు.. అన్ని శాఖలను కుదిపేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మర్కజ్ ఘటనతో ఉలిక్కి పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు చేప‌ట్టిన అవ‌గాహ‌న చ‌ర్య‌ల్లో భాగంగా క‌ర్నూలు జిల్లాలో ఓ పోలీసు అధికారి వినూత్నప్ర‌యోగం చేశాడు.
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టే దిశ‌గా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. క‌ర్నూలు జిల్లాలోని పీ.ప‌ల్లె గ్రామంలో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ మారుతీ శంక‌ర్ చేసిన ప్ర‌య‌త్నం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. పీ ప‌ల్లె గ్రామంలో ఓ గుర్రంపై స‌వారీ చేస్తూ ప్ర‌జ‌ల్లో కోవిడ్‌-19పై అవ‌గాహ‌న క‌ల్పించాడు. అయితే, ఇక్క‌డ అంద‌రినీ ఆక‌ట్టుకున్న విష‌యం ఏంటంటే..ఆ గుర్రంపై ఉన్న పెయింగ్‌..తెల్ల గుర్రంపై ఎరుపు రంగుతో అత్యంత భ‌యంక‌ర‌మైన ఈ క‌రోనా వైర‌స్ రుపాన్ని గీశారు. ఆ గుర్రంపై స‌వారీ చేస్తూ గ్రామంలో తిరుగుతూ వైర‌స్ వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాన్ని వివ‌రించారు.
కాగా అత‌డు చేసిన ఈ ప్ర‌చారాన్ని కొంద‌రు సెల్‌ఫోన్ల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌టంతో అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇన్‌స్పెక్ట‌ర్ మారుతీ శంక‌ర్ చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌జ‌లు, అధికారులు ఎంత‌గానో అభినందించారు.