కేరళలో కొత్తగా మరో 1,298 పాజిటివ్ కేసులు

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్‌లాక్‌ ప్ర్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం..

కేరళలో కొత్తగా మరో 1,298 పాజిటివ్ కేసులు

Updated on: Aug 07, 2020 | 5:50 AM

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్‌లాక్‌ ప్ర్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,298 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 18,337 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 97 మంది మరణించారు. ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలు చోట్ల లాక్‌డౌన్ విధిస్తోంది ప్రభుత్వం.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us