బ్రేకింగ్: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కి కరోనా పాజిటివ్

| Edited By:

Aug 25, 2020 | 1:26 PM

తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా రిపోర్టులో తేలింది. దీంతో వెంటనే ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా డీకే శివకుమార్‌కి పాజిటివ్ తేలడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు..

బ్రేకింగ్: పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కి కరోనా పాజిటివ్
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ ఈ మధ్య వరుసగా పలువురు పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు వీరికి కూడా కరోనా సోకుతూండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా రిపోర్టులో తేలింది. దీంతో వెంటనే ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా డీకే శివకుమార్‌కి పాజిటివ్ తేలడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, గత కొద్ది రోజులుగా శివకుమార్‌ని కలిసిన వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు.

కాగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 2,83,665 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటివరకూ 4,810 మంది కోవిడ్‌తో మరణించారు. ఇక ప్రస్తుతం 81,230 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,97,625 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో కర్నాటక రాష్ట్రం దేశ వ్యాప్తంగా నాలుగవ స్థానంలో ఉంది.

Read More:

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!