శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

|

Jul 04, 2020 | 11:24 AM

Kanakadurgamma as Sakambari Devi : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో జరిగే శాకంబరి ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దుర్గాదేవి మూడు రోజులు పాటు శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. శాకాంబరీ ఉత్సవాలు పురష్కరించుకుని ఇంద్రకీలాద్రి కొత్తశోభను సంతరించుకుంది. మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించి.. మూడవరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అధికారులు […]

శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం
Follow us on

Kanakadurgamma as Sakambari Devi : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో జరిగే శాకంబరి ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దుర్గాదేవి మూడు రోజులు పాటు శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. శాకాంబరీ ఉత్సవాలు పురష్కరించుకుని ఇంద్రకీలాద్రి కొత్తశోభను సంతరించుకుంది. మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించి.. మూడవరోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేకమైన ప్లానింగ్‌తో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం ఆషాడమాసంలో కొత్తశోభను సంతరించుకోంటోంది. ప్రతీ ఏడాది ఆషాడ మాషంలో దుర్గామ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిస్తారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది కూడా శాకాంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఉదయం 6 గంటలకు వేదపండితులు మేళతాళాలతో మంగళవాయిద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణపతి పూజ తో ఉత్సవాలు ప్రారంభించారు. శాకాంబరీ ఉత్సవాలంటే ఆలయ ప్రాంగణంతో పాటుగా అమ్మవారి అంతరాలయం, అమ్మవారిని సైతం కాయగూరలు, పండ్లు, ఆకులతో అలంకరిస్తారు.