కరోనా వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కి నడుం బిగించిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ

| Edited By:

Mar 31, 2020 | 12:53 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 పై సమరానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమాయత్తమైంది. ఈ వ్యాధి  చికిత్సలో తోడ్పడే వ్యాక్సీన్ తయారీకి నడుం బిగించింది. ఇందుకు అనువుగా ఈ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ఆరోగ్యవంతుడైన..

కరోనా వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కి నడుం బిగించిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 పై సమరానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమాయత్తమైంది. ఈ వ్యాధి  చికిత్సలో తోడ్పడే వ్యాక్సీన్ తయారీకి నడుం బిగించింది. ఇందుకు అనువుగా ఈ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది. దీనికోసం గత జనవరి నుంచే సన్నాహాలు మొదలు పెట్టామని  , తమ సంస్థకు చెందిన ‘జన్ సేన్ ఫార్మస్యుటికల్ కంపెనీ, అమెరికాకు చెందిన బయో మెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం మేరకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. తమ ప్రయత్నంలో భాగంగావందకోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ సప్లయ్ చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది.

ఇందుకు గాను ఈ లక్ష్య సాధనకోసం తన ఉత్పాదక సామర్థ్యాన్ని ఓ కొత్త అమెరికన్ వెబ్ సైట్ ద్వారా విస్తృతం చేయనున్నామని, ఆ తరువాత ఇతర దేశాల సైట్లకు కూడా దీన్ని అందుబాటులో ఉంచుతామని వివరించింది. మా తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీస్ సెప్టెంబరు నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరు నాటికి క్లినికల్ డేటా ప్రభావాన్ని మేం అంచనావేస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. .మొదటి విడత వ్యాక్సీన్ మరీ అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేందుకు వచ్ఛే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంటుంది. కరోనా సీజనల్ వ్యాధి కావచ్ఛునని వార్తలు వస్తున్న వేళ..జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈ వివరణను ఇవ్వడం విశేషం.