2021లో ఒలంపిక్స్ గేమ్స్ లేనట్టే.. జపాన్ ప్రధాని షింజో అబే

| Edited By: Pardhasaradhi Peri

Apr 29, 2020 | 8:20 PM

కరోనా మహమ్మారి కారణంగా వచ్ఛే ఏడాది ఒలంపిక్స్ గేమ్స్ నిర్వహించడం అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే అంగీకరించారు. కరోనా పూర్తిగా అదుపులోకి రావాల్సిందేనని, మొదట ఈ వైరస్ పై జరిపే పోరాటం విజయవంతమై ఇది అంతమైతే తప్ప ఒలంపిక్స్ నిర్వహణ కష్ట సాద్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఎలా జరగాలంటే కరోనాపై పోరులో ప్రపంచం జయించిందన్న రీతిలో జరగాలి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు.. కరోనా చికిత్సకు అవసరమయ్యే వ్యాక్సీన్ మార్కెట్లోకి వస్తే […]

2021లో ఒలంపిక్స్ గేమ్స్ లేనట్టే.. జపాన్ ప్రధాని షింజో  అబే
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా వచ్ఛే ఏడాది ఒలంపిక్స్ గేమ్స్ నిర్వహించడం అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే అంగీకరించారు. కరోనా పూర్తిగా అదుపులోకి రావాల్సిందేనని, మొదట ఈ వైరస్ పై జరిపే పోరాటం విజయవంతమై ఇది అంతమైతే తప్ప ఒలంపిక్స్ నిర్వహణ కష్ట సాద్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఎలా జరగాలంటే కరోనాపై పోరులో ప్రపంచం జయించిందన్న రీతిలో జరగాలి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు.. కరోనా చికిత్సకు అవసరమయ్యే వ్యాక్సీన్ మార్కెట్లోకి వస్తే తప్ప ఒలంపిక్స్ నిర్వహణ  సాధ్యమయ్యే పని కాదని జపాన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ఇక టోక్యో 2020 ప్రెసిడెంట్ యొషిలో మోరీ…వచ్ఛే సంవత్సరం సమ్మర్ లో ఈ క్రీడలను నిర్వహించలేకపోతే మళ్ళీ వాయిదా వేయడం కన్నా పూర్తిగా రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. మొత్తానికి కరోనా కారణంగా ఈ అతి పెద్ద క్రీడోత్సవానికి గ్రహణం పట్టుకుంది.