Corona Effect: కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్‌ ఆర్మీ.. విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులే కారణం..

|

Apr 17, 2021 | 8:26 AM

Corona Effect: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని అంతా సంతోషించేలోపే సెకండ్‌ వేవ్‌ రూపంలో ఈ రాకాసి మళ్లీ పంజా విసురుతోంది. గతేడాది మించి...

Corona Effect: కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్‌ ఆర్మీ.. విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులే కారణం..
Indian Army Corona vaccination
Follow us on

Corona Effect: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని అంతా సంతోషించేలోపే సెకండ్‌ వేవ్‌ రూపంలో ఈ రాకాసి మళ్లీ పంజా విసురుతోంది. గతేడాది మించి కేసులు నమోదవుతుండడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతుండడంతో ప్రభుత్వాలు, అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఇండియన్‌ ఆర్మీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యానికి సంబంధించిన ఆఫీసుల్లో ఉద్యోగులను 50 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయంలో కార్యలయాలకు రావాలని, భౌతిక దూరంతో పాటు కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఇక సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్‌ విధానంలో ఆన్‌లైన్‌ వేదికగా చేపట్టాలని కోరారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పాలమిలిటరీ వర్గాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే దేశంలో మరోసారి గతేడాది పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా కోవిడ్‌ రోగులు, వైరస్‌ కారణంగా మరణించిన వారి శవాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ విధించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటేనే పరిస్థితులు ఎంతలా చేయి దాటి పోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక కరోనా మొదటి వేవ్‌ అప్పటి రికార్డులు అన్ని తొలగిపోతున్నాయి. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. మరి కరోనా సెకండ్ వేవ్‌కు ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.

Also Read: Corona Virous: ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు అధికం.. వైద్యుల హెచ్చరిక…!! ( వీడియో )

Corona Virus Pandemic: దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం.. సేఫ్‌జోన్‌లో ఉన్న ఈ పది ప్రాంతాలు..

Corona: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. 20 మంది డాక్టర్లకు పాజిటివ్.. జిల్లాలో భారీగా కేసులు