యుఎస్…నిరసనకారులకు 10 లక్షల డాలర్ల విలువైన ఫేస్ మాస్కులిచ్చిన పారిశ్రామికవేత్త

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 5:11 PM

రేసిజానికి, పోలీసుల అమానుషానికి వ్యతిరేకంగా అమెరికాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులకు తాను 10 లక్షల డాలర్ల విలువైన ఫేస్ మాస్కులను, ప్రొటెక్టివ్ షీల్డులను విరాళంగా ఇస్తున్నానని భారత సంతతికి చెందిన  పారిశ్రామికవేత్త..

యుఎస్...నిరసనకారులకు 10 లక్షల డాలర్ల విలువైన ఫేస్ మాస్కులిచ్చిన పారిశ్రామికవేత్త
Follow us on

రేసిజానికి, పోలీసుల అమానుషానికి వ్యతిరేకంగా అమెరికాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులకు తాను 10 లక్షల డాలర్ల విలువైన ఫేస్ మాస్కులను, ప్రొటెక్టివ్ షీల్డులను విరాళంగా ఇస్తున్నానని భారత సంతతికి చెందిన  పారిశ్రామికవేత్త గురీందర్ సింగ్ ఖల్సా ప్రకటించారు. యుఎస్ లో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి కారకులైన పోలీసులపై కఠిన చర్యలు చేపట్టాలని, పోలీసు సంస్కరణలను చేపట్టాలని కోరుతూ నిరసనకారులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించిన సంగతి విదితమే. ఒకప్పుడు…. జూన్ 19 న ఈ దేశంలో బానిసలకు స్వేచ్చ లభించిన రోజును ‘జూన్ టీన్త్’ గా పాటిస్తున్న సందర్భంగా ఖల్సా ఈ ప్రకటన చేశారు. ద్వేషం, హింసను ప్రేమ, అభిమానంగా మార్చుకోవాలనుకుంటే అమెరికా అసలైన రూపాన్ని ‘ఆవిష్కరించవలసిన’ అవసరం ఉందని ఆయన అంటున్నారు. రాజకీయేతర సంస్థను కూడా ఏర్పాటు చేసిన ఖల్సా.. శాంతియుత నిరసనే మనకు శిరోధార్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మహాత్మా గాంధీ వంటి నాయకుల గురించి ప్రస్తావించారు. ‘జస్ట్ మెర్సీ’,’ 13′ అనే మూవీలను, ‘హెల్ ఆన్ వీల్స్’ అనే సిరీస్ ని చూసి తానీ స్ఫూర్తిని పొందానని ఆయన చెప్పుకున్నారు.