India Vs Australia 2020: అభిమానులకు గుడ్ న్యూస్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా నెగిటీవ్.. ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..

|

Jan 04, 2021 | 10:13 AM

India Vs Australia 2020: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న..

India Vs Australia 2020: అభిమానులకు గుడ్ న్యూస్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా నెగిటీవ్.. ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..
Follow us on

India Vs Australia 2020: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు, వారి సహాయక సిబ్బంది కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, పృథ్వి షా రెస్టారెంట్‌కు వెళ్లడం.. దానికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే, తాజాగా ఆ ఐదుగురు క్రికెట్లతో పాటు ఇతర జట్టు సభ్యులు, వారి సహాయక సిబ్బంది ఆర్టీపీసీఆర్ టెస్ట్(కరోనా టెస్ట్) చేయించుకున్నారు. ఈ టెస్ట్‌లో వారందరికీ నెగిటీవ్ అని తేలింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

Also read:

Tadipatri High Tension : తాడిపత్రిలో హైటెన్షన్.. దీక్షకు అనుమతి లేదంటున్న పోలీసులు.. భయపడేది లేదంటున్న జేసీ బ్రదర్స్

Time Slot For Vaccine: వ్యాక్సిన్‌ పంపిణీకి హైదరాబాద్‌లో కొత్త విధానం.. సమయానికి వెళ్లేలా ఏర్పాటు..