Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే?

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఇటీవల..

Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే?
Coronavirus

Updated on: Mar 13, 2021 | 10:15 AM

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఇటీవల వరుసగా వేల సంఖ్యలో కేసులు పెరగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,882 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728 (1.13 కోట్లు) కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 140 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,58,446 కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనా కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జ్‌ల సంఖ్య రోజూ గణనీయంగా తగ్గుతోంది. కరోనా నుంచి నిన్న 19,957 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,09,73,260 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,02,022 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.82 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.40 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8,40,635 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 12వ తేదీ వరకు మొత్తం 22,58,39,273 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు.

 

Also Read:

Covid-19 Variant: దక్షిణాఫ్రికా కరోనా స్ట్రేయిన్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన అన్నాచెల్లెలిద్దరికీ పాజిటివ్..

Loading...
Unable to load recommendations.
Follow Us