CoWIN Challenge: యాప్ డెవలప్‌మెంట్‌పై చాలెంజ్ విసిరిన కేంద్ర మంత్రి… స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం…

| Edited By:

Dec 24, 2020 | 12:05 PM

కరోనాపై పోరులో భాగంగా కేంద్రం ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్వర్క్ (కొవిన్) యాప్‌ను రూపొందించింది.

CoWIN Challenge: యాప్ డెవలప్‌మెంట్‌పై చాలెంజ్ విసిరిన కేంద్ర మంత్రి... స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం...
CoWin app
Follow us on

కరోనాపై పోరులో భాగంగా కేంద్రం ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్వర్క్ (కొవిన్) యాప్‌ను రూపొందించింది. టీకా పొందాలనుకునే వారు ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే యాప్‌ను మరింత సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఒక చాలెంజ్ విసిరారు. యాప్ డెవలపర్స్ నుంచి దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. దీని కోసం డిసెంబర్ 23 నుంచి జనవరి 15 2021 వరకు సమయాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యాప్ డెవలపర్స్, స్టార్టప్ కంపెనీలు https://meitystartuphub.in వెబ్సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

 

నగదు బహుమతులు సైతం…

ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంకేతిక, సమాచార శాఖ సంయుక్తంగా కొవిన్ యాప్‌ను తీసుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్ సమాచారం, పంపిణీ విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. అయితే దీనికి మరింత సాంకేతికతను, సమర్థతను జోడించేందుకే కేంద్ర మంత్రి యాప్ డెవలపర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే టాప్ 5 యాప్ డెవలపర్స్‌కు కొవిన్ యాప్‌ను మరింత మెరుగు చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వారిలో ముగ్గురికి రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే టాప్ 2లో ఉన్న యాప్ డెవలపర్స్‌కు 40 లక్షలు, 20 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.