Corona vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందంజలో భారత్.. ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా టీకా.. తెలుగు రాష్ట్రాల్లో..

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందంజలో..

Corona vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందంజలో భారత్.. ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా టీకా.. తెలుగు రాష్ట్రాల్లో..

Updated on: Jan 30, 2021 | 1:36 PM

Covid-19 Vaccination in India: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి 35 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. 30లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడానికి అమెరికా లాంటి దేశాలకు 18 రోజులు పట్టగా.. ఇజ్రాయిల్‌లో 33 రోజులు, యూకేలో 36 రోజులు పట్టింది. అయితే భారత్‌‌ మాత్రం కేవలం 13 రోజుల్లోనే ఆ మార్క్‌ను చేరుకోవడం విశేషమని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. టీకా పంపిణీలో భాగంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 5,71,974 మందికి వ్యాక్సిన్‌ వేశారు. దీంతో జనవరి 30 మధ్యాహ్నం 12 గంటలవరకు మొత్తం 35,00,027 మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాక్సిన్, సీరమ్‌ ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జనవరి 16వ తేదీన దేశంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం చాలా తక్కువ దుష్ప్రభావ కేసులతో నిర్విరామంగా కొనసాగుతోంది.
యూపీలో అత్యధికంగా..
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో ఉత్తరప్రదేశ్‌ ముందుంది. తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం.. అత్యధికంగా యూపీలో 4,63,793 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320కి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో 1,79,038 మందికి, తెలంగాణలో 1,66,606 మందికి వ్యాక్సిన్ వేశారు.

Also Read:

Corona Vaccine: మరో కరోనా టీకా ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న సీరం ఇనిస్టిట్యూట్‌.. అనుమతుల కోసం ఎదురు చూపు

Budget 2021: పార్లమెంట్ బడ్జెట్ సెషన్, నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, విపక్షాల నుంచి ‘చట్టాల సెగ’