
నార్త్ కొరియాకు ఇండియా భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని మానవతా దృక్పథంతో ఈ సాయం చేసినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ నాటి నుంచో కొరియా దేశాలకు యాంటీ ట్యూబర్ కొలోసిస్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ మందులను ఉత్తర కొరియా లోని భారత రాయబారి అతుల్ మల్హరి అక్కడి ప్రభుత్వానికి అందజేశారు.
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు లేనప్పటికీ..ముఖాలకు మాస్కులు ధరించనివారు తప్పనిసరిగా మూడు నెలలపాటు లేబర్ పనులు చేయాలని ఆ ప్రభుత్వం శిక్షగా విధించింది. విద్యార్థుల బృందాలు వీధుల్లో నిఘా టీములుగా తిరుగుతూ.. మాస్కులు ధరించనివారి పని పడుతున్నారట.