Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

|

Apr 07, 2021 | 9:46 AM

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతుండటం

Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
Coronavirus updates in India
Follow us on

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతుండటం కలవరపెడుతోంది. గత 24 గంటల్లో మళ్లీ రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,28,01,785 (1.28 కోట్లు) కు పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 630 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,66,177 కు చేరింది. గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య భారీగా పెరిగింది.

కాగా.. కరోనా నుంచి నిన్న 59,856 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,17,92,135 (1.17 కోట్లు) మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8,43,473 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.11 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.30 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 12,08,329 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్7వ తేదీ వరకు మొత్తం 25,14,39,598 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 8,70,77,474 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

Also Read:

మిళనాడులో మరోసారి పంజా విరుసుతున్న కరోనా.. 15 మంది రైల్వే గ్యారేజ్‌ సిబ్బందికి పాజిటివ్

దండకారణ్యంలో రక్తపాతం… ఇంకా మావోల చెరలోనే జవాన్ రాకేశ్వర్ సింగ్.. మావోయిస్ట్ లేఖలో మర్మమేంటీ..?