‘ఈ ప్రపంచంలోకి కలిసే వచ్చాం.. కలిసే నిష్క్రమిస్తాం’.. కరోనాతో కవలల మృతి

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 1:40 PM

బ్రిటన్ లో ఇద్దరు కవల సోదరీమణులు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. 37 ఏళ్ళ ఎమ్మా డెవిస్, ఆమె సోదరి కేటీ డెవిస్ కరోనా కాటుకు బలయ్యారు. సౌతాంఫ్టన్ లోని ఆసుపత్రిలో ఇద్దరూ నర్సులుగా పని చేస్తూ వచ్చారు. ఎమ్మా కన్ను మూసిన రెండు రోజులకే కేటీ కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే కొన్ని రోజులుగా ఇద్దరూ ఇతర శారీర రుగ్మతల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారని వీరి మరో సోదరి జో డెవిస్ తెలిపింది. […]

ఈ ప్రపంచంలోకి కలిసే వచ్చాం.. కలిసే నిష్క్రమిస్తాం.. కరోనాతో కవలల మృతి
Follow us on

బ్రిటన్ లో ఇద్దరు కవల సోదరీమణులు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. 37 ఏళ్ళ ఎమ్మా డెవిస్, ఆమె సోదరి కేటీ డెవిస్ కరోనా కాటుకు బలయ్యారు. సౌతాంఫ్టన్ లోని ఆసుపత్రిలో ఇద్దరూ నర్సులుగా పని చేస్తూ వచ్చారు. ఎమ్మా కన్ను మూసిన రెండు రోజులకే కేటీ కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే కొన్ని రోజులుగా ఇద్దరూ ఇతర శారీర రుగ్మతల కారణంగా అనారోగ్యం బారిన పడ్డారని వీరి మరో సోదరి జో డెవిస్ తెలిపింది. వందమందికి పైగా మరణించిన బ్రిటిష్ హెల్త్ వర్కర్లలో వీరు కూడా చేరిపోయారని ‘జో’ విలపిస్తూ వెల్లడించింది. ఇతరులకు ఎప్పుడూ సాయపడడమే తమ లక్ష్యమని తన అక్కలు చెప్పేవారని, రోగులకు ఇద్దరూ ఎంతో అభిమానం, ఆప్యాయతతో సేవలు చేసేవారని ఆమె చెప్పింది. తాము ఈ ప్రపంచంలోకి కలిసే వచ్చామని, కలిసే నిష్క్రమిస్తామని తరచూ చేప్పేవారని జో పేర్కొంది. ఈ కవలల మృతికి ఈ ఆసుపత్రి స్టాఫ్ అంతా విచారంలో మునిగిపోయారు.

బ్రిటన్ లో 143,464 కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 20 వేల మంది కరోనా రోగులు మరణించారు.