రేపు టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయం..?

|

Jul 19, 2020 | 9:59 PM

ICC To Take Decision On T20 World Cup Tomorrow: మాయదారి కరోనా వైరస్ లేకపోతే ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ విండోలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ సన్నద్ధం అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృస్తిస్తుండటంతో క్రికెట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై ఐసీసీ రేపు నిర్ణయం తీసుకోనుందని […]

రేపు టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయం..?
Follow us on

ICC To Take Decision On T20 World Cup Tomorrow: మాయదారి కరోనా వైరస్ లేకపోతే ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ విండోలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ సన్నద్ధం అయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృస్తిస్తుండటంతో క్రికెట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై ఐసీసీ రేపు నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇప్పటికే ప్రపంచకప్ నిర్వహించలేమని ఆస్ట్రేలియా తేల్చి చెప్పడంతో.. ఐసీసీ రేపటి నుంచి మొదలయ్యే సమావేశాల్లో తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.

ఒకవేళ వరల్డ్ కప్ వాయిదా వేస్తే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఉన్నప్పుడు ప్రపంచకప్ నిర్వహించాలనే పట్టుదలతో ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో రేపు ప్రపంచకప్ నిర్వహణపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..