వ్యాపారి ఇంట్లో బర్త్‌డే పార్టీ..ఇద్దరు మృతి, ప్రజాప్రతినిధులు సహా పలువురికి కరోనా

|

Jul 04, 2020 | 3:42 PM

కరోనా కాలంలో విందులు, వినోదాలు, వివాహాది శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అయిన్నప్పటికీ కొందరు సర్కార్ సూచనలు భేఖతారు చేస్తున్నారు. గృహప్రవేశాలు, పెళ్లి రోజు, పుట్టిన రోజులని రకారకాల కారణాలతో పార్టీలు చేస్తూ..

వ్యాపారి ఇంట్లో బర్త్‌డే పార్టీ..ఇద్దరు మృతి, ప్రజాప్రతినిధులు సహా పలువురికి కరోనా
Follow us on

కరోనా కాలంలో విందులు, వినోదాలు, వివాహాది శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అయిన్నప్పటికీ కొందరు సర్కార్ సూచనలు భేఖతారు చేస్తున్నారు. గృహప్రవేశాలు, పెళ్లి రోజు, పుట్టిన రోజులని రకారకాల కారణాలతో పార్టీలు చేస్తూ..వారితో పాటుగా పదిమందికి కరోనా వైరస్ సంక్రమించటానికి కారకులవుతున్నారు. మొన్న ఏపీలో ఓ పెళ్లి చూపులకు వెళ్లిన కుటుంబానికి కరోనా సోకి వృద్దుడు మరిణించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌కు చెందిన ఓ వ్యాపారి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించాడు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాలు పరిశీలించగా..

హైదరాబాద్‌ నగరంలోని హిమాయత్ నగర్‌కు చెందిన ఓ వ్యాపారి జూన్ మూడో వారంలో తన ఇంట్లోనే బర్త్‌డే పార్టీ నిర్వహించాడు. పార్టీకి సుమారుగా 150 మందికిపైగా ఆహ్వానించాడు. బంధు మిత్రులు, తోటి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారట. పుట్టిన రోజు వేడుకలకు హాజరైన వారందరికీ రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చారట. బర్త్ డే పార్టీ ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఆ వ్యాపారిలో దగ్గు, ఆయాసం లాంటి కరోనా లక్షణాలు కనిపించాయి. అయినప్పటికీ కరోనా టెస్ట్ చేయించుకోలేదని తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం, జ్వరం కూడా రావడంతో అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే.. ఆ వ్యాపారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మరో వ్యాపారికి నాలుగు రోజుల తర్వాత కోవిడ్ లక్షణాలు కనిపించటంతో అతన్ని కూడా ఆస్పత్రిలో చేర్పించి టెస్ట్ చేయించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూనే అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడని సమాచారం.

ఇదిలా ఉంటే, పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వారిలో ఓ ప్రజాప్రతినిధి సహా 20 మందికి కరోనా సోకినట్లుగా సమాచారం. బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి కుటుంబ సభ్యుల్లోనూ ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వ్యాపారి ఇచ్చిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వారందరినీ ట్రేస్ చేసే పనిలో పడ్డారు.