అరె ! లాక్ డౌన్ ఎఫెక్ట్ ! ‘యమున’ ఎలా స్వఛ్చంగా మారిపోయిందో ? ‘

దేశంలో రెండు నెలలపాటు కొనసాగిన లాక్ డౌన్ 'అద్భుతమైన పని' కూడా చేసింది. ఢిల్లీలో పాతికేళ్లుగా అధికారంలోకి వఛ్చిన ప్రభుత్వాలు 5 వేల కోట్లకు పైగా వ్యయం చేసినా....

అరె ! లాక్ డౌన్ ఎఫెక్ట్ ! 'యమున' ఎలా స్వఛ్చంగా  మారిపోయిందో ? '
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 12:10 PM

దేశంలో రెండు నెలలపాటు కొనసాగిన లాక్ డౌన్ ‘అద్భుతమైన పని’ కూడా చేసింది. ఢిల్లీలో పాతికేళ్లుగా అధికారంలోకి వఛ్చిన ప్రభుత్వాలు 5 వేల కోట్లకు పైగా వ్యయం చేసినా….  చేయలేకపోయిన పనిని లాక్ డౌన్ చేసింది. యమునా నదిని శుద్ది చేసేసింది. ఇప్పుడిది జలజలా స్వచ్ఛంగా పారుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు లేవు.. వాహన కాలుష్యం అంతకన్నా లేదు. రెండు నెలలుగా ఈ ‘చీడపీడలు’ లేకపోవడంతో ఈ నది నీరు దానికదే శుద్ది అయిపోయింది. ఈ కాలుష్యరహిత జలాల్లో గ్రే హెరాన్, ఐబిస్ వంటి వలస పక్షులు చేపల కోసం స్వేఛ్చగా వేటాడుతున్నాయి. జలాల్లో ఈదుతున్నాయి. తాను 22 ఏళ్ళుగా యమునా శుద్ది కార్యాచరణ ప్రణాళికా బృందంలో సభ్యుడినని, కానీ ఇంత పరిశుద్ధంగా ఈ నది నీటిని ఎన్నడూ చూడలేదని డాక్టర్ రాజీవ్ చౌహాన్ అనే కన్సర్వేషన్ ఆఫీసర్ తెలిపారు. నదులపై లాక్ డౌన్ ప్రభావం ఇంతగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారాయన. ఏళ్ళ తరబడి యమునా నదిపై అధ్యయనం చేస్తున్న వైల్డ్ లైఫ్ ఇండియా-డెహ్రాడూన్ ప్రాజెక్ట్ సభ్యుడు కూడా అయిన రాజీవ్ చౌహాన్.. ఈ అద్భుతం నిజంగా మరువలేనిదని అభివర్ణించారు. 1400 కి.మీ. పొడవునా ఏడు రాష్ట్రాల గుండా యమునా నది ప్రవహిస్తోంది. ఈ నది 33 శాతం శుద్ది అయిందని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కూడా అంగీకరించింది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!