హిమాచల్ ప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు.. తాజా వివరాలు ఇవే..

| Edited By:

Jun 13, 2020 | 10:56 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం అక్కడ కేవలం పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నప్పటికీ.. ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల అనంతరం అక్కడ కేసుల సంఖ్య వందల్లోకి చేరింది.

హిమాచల్ ప్రదేశ్‌లో పెరుగుతున్న కేసులు.. తాజా వివరాలు ఇవే..
Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం అక్కడ కేవలం పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నప్పటికీ.. ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల అనంతరం అక్కడ కేసుల సంఖ్య వందల్లోకి చేరింది. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 493కి చేరింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ప్రస్తుతం 177 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 299 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక మరో ఆరుగురు కరోనా బారినపడి మరణించినట్లు పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటేసింది. ఇప్పటి వరకు 3,08,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 1,45,779 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. మరో 1,54,330 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 8,884 మంది మరణించారన్నారు.