“ఆయన” ఎవ‌రో చెప్పండి-హన్సిక

"నీకు పెళ్లవుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు.." అని ఓ మిత్రుడు ఆమెను ట్వీట్ ద్వారా ప్రశ్నించగా... ఆ విషయం "తనకు కూడా ఇప్పుడే తెలిసిందని.., అందుకే చెప్పలేకపోయాను.." అని నవ్వుతూ సమాధానమిచ్చారు...

ఆయన ఎవ‌రో చెప్పండి-హన్సిక

Updated on: Jun 12, 2020 | 8:05 AM

సౌతిండియన్ టాప్ హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తను రెండు రోజుల్లో ఆమె వివాహం చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌ ను కుదిపేసింది‌. తన పెళ్లిపై వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.

ఇంత‌కీ నేను పెళ్లి చేసుకునే ఆ వ్యాపార‌వేత్త ఎవ‌రో నాకూ చెప్ప‌కూడ‌దూ అంటూ వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చారు. “నీకు పెళ్లవుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు..” అని ఓ మిత్రుడు ఆమెను ట్వీట్ ద్వారా ప్రశ్నించగా… ఆ విషయం “తనకు కూడా ఇప్పుడే తెలిసిందని.., అందుకే చెప్పలేకపోయాను..” అని నవ్వుతూ సమాధానమిచ్చారు. తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. హన్సిక ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి తన మాజీ ప్రియుడు శింబుతో కావటం విశేషం. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న స్టోరీతో తెరకెక్కుతున్న “మహా” అనే చిత్రంలో శింబు, హన్సిక కలిసి నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యమైంది.