
కరోనా వైరస్ కాదు గానీ.. క్వారంటైన్ శిబిరాల్లో ఉండేవారు మాత్రం నరకం చూస్తున్నారు. వారిని జైలులో ఖైదీల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కొన్ని క్వారంటైన్ కేంద్రాల నిర్వాహకులు. తాజాగా ఆగ్రాలోని ఓ క్వారంటైన్ సెంటర్ యాజమాన్యం.. అందులో ఉండే వాళ్లకు తిండిని పశువులకు విసిరినట్లుగా విసిరేస్తున్నారు. దీనితో జనాలు ఒకరిపై ఒకరు పడి ఆహార పొట్లాలు, నీళ్ల బాటిల్స్ కోసం పోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్వారంటైన్ చేసేవారు బయటికి రాకుండా ఉండేలా అక్కడ ఓ పెద్ద గేటును ఏర్పాటు చేసి.. పీపీఈ కిట్ ధరించిన సిబ్బంది అక్కడి వరకు వచ్చి ఆహారం, నీటిని ఉంచుతున్నారు. ఇక వాటి కోసం లోపల ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడుతూ సామాజిక దూరాన్ని పాటించకుండా గేటు సందుల్లోనుంచి చేతులు పెడుతూ అతి కష్టం మీద పొట్లాలు అందుకుంటున్నారు. ఇక ఇలా కనీస సౌకర్యాలు కూడా లేకుండా క్వారంటైన్ మైంటైన్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ కంటే ఇలాంటి చర్యలు చాలా దారుణమని .. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
And then you blame those who want to escape quarantine – quarantined fed shabbily in agra ..@pranshumisraa pic.twitter.com/oZ0ALW19li
— pallavi ghosh (@_pallavighosh) April 26, 2020