ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..

| Edited By:

May 20, 2020 | 12:28 PM

ఈ 21(గురువారం) నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని ప్రభుత్వం చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా

ఏపీలో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల హాజరు తప్పనిసరి..
Follow us on

ఈ నెల 21(గురువారం) నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా విధులకు హాజరు కావాలని.. మాస్క్ లేకుండా ఏ ఉద్యోగి కూడా విధులకు హాజరు కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతించనున్నారు.

భౌతికంగా పంపించే దస్త్రాలను సాధ్యమైనంత తగ్గించాలని.. ఇ-ఫైళ్ల ద్వారా దస్త్రాలను పంపుకోవాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, చేతులను శానిటైజ్‌ చేసిన తరువాత పంపిస్తారు. అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్‌ చేయాలి. ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్‌ ధరించి విధులకు హాజరు కావాలి. కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.