ఆగని కరోనా విలయం.. అదే మరణ మృదంగం

| Edited By: Pardhasaradhi Peri

Jun 07, 2020 | 7:32 PM

ప్రపంచ దేశాలను కరోనా  మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా సుమారు 70 లక్షల మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు ఓ రిపోర్టు పేర్కొంది. నాలుగు లక్షలమంది మృత్యుబాట..

ఆగని కరోనా విలయం.. అదే మరణ మృదంగం
Follow us on

ప్రపంచ దేశాలను కరోనా  మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా సుమారు 70 లక్షల మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు ఓ రిపోర్టు పేర్కొంది. నాలుగు లక్షలమంది మృత్యుబాట పట్టారని  కూడా వెల్లడించింది. బ్రెజిల్, ఇండియా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోయినట్టు రాయిటర్స్ రిలీజ్ చేసిన ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ కేసుల్లో సుమారు 30 శాతం లేదా 20 లక్షల ఇన్ఫెక్షన్లు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికాలో ఈ కేసులు మరింతగా పెరిగాయి. కేవలం అయిదు నెలల్లో కరోనా మరణాల సంఖ్య ఎంతో ఎక్కువగా పెరిగిందని, ఏటా మలేరియాతో మరణించే వారి సంఖ్యకు ఇది సమానంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. టెస్టింగులను ముమ్మరం చేయకపోతే ఈ కరోనా మహమ్మారి ఇంకా పేట్రేగిపోతుందని కూడా హెచ్చరించింది.