బెయిల్ కావాలా నాయనా.. అయితే పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళంతో పాటు…!

| Edited By: Pardhasaradhi Peri

Apr 18, 2020 | 5:08 PM

జార్ఖండ్ హైకోర్టు ఓ కేసుకు సంబంధించిన విషయంలో బెయిల్ కోసం ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. మీకు బెయిల్ కావాలంటే.. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళమివ్వాలి. అంతేకాదు.. మీ ఫోన్‌లలో ఆరోగ్యసేతు యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ షరతులు పెట్టి.. బీజేపీకి చెందిన ఓ మాజీ ఎంపీతో సహా.. మరో ఐదుగురు దోషులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్‌పై బయటికి వెళ్లిన తర్వాత.. లాక్‌డౌన్‌ నిబంధనలును పాటించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. బెయిల్ పొందిన వారిలో మాజీ ఎంపీ సోమ్ మరండితో […]

బెయిల్ కావాలా నాయనా.. అయితే పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళంతో పాటు...!
Follow us on

జార్ఖండ్ హైకోర్టు ఓ కేసుకు సంబంధించిన విషయంలో బెయిల్ కోసం ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. మీకు బెయిల్ కావాలంటే.. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు విరాళమివ్వాలి. అంతేకాదు.. మీ ఫోన్‌లలో ఆరోగ్యసేతు యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ షరతులు పెట్టి.. బీజేపీకి చెందిన ఓ మాజీ ఎంపీతో సహా.. మరో ఐదుగురు దోషులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్‌పై బయటికి వెళ్లిన తర్వాత.. లాక్‌డౌన్‌ నిబంధనలును పాటించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. బెయిల్ పొందిన వారిలో మాజీ ఎంపీ సోమ్ మరండితో పాటు.. వివేకానంద్ తివారీ, హిసబి రాయ్, సంచయ్ బర్దన్, అనురాగ్ ప్రసాద్ సాహ్ తదితరులు ఉన్నారు. మార్చి 2012లో రైల్ రోకోకు సంబంధించిన కేసులో వీరంతా దోషులుగా తేలారు. దీంతో రైల్వే జుడీషియల్ కోర్టు ఈ ఆరుగురికి ఏడాది జైలు శిక్ష విధించింది.

అయితే రైల్వే జుడీషియల్‌ కోర్టు తీర్పుపై.. సెషన్స్ కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో.. జార్ఖండ్ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే జనవరి నుంచి వీరు కస్టడీలో ఉన్నారు. వీరందరికీ జస్టిస్ అనుభ రావత్ చౌదరి కొన్ని ఆసక్తికర షరతులతో బెయిల్ మంజూరు చేశారు. వీరు పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.35 వేలు చొప్పున విరాళం ఇవ్వాలనీ.. అంతేకాకుండా ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు.