ఆ గ్రంథంలో కరోనాకు విరుగుడు గురించి ఉంది: గరికపాటి

భూమి మీద మానవాళితో పాటు మిగిలిన జీవులను వణికిస్తోన్న కరోనాకు మందును కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

ఆ గ్రంథంలో కరోనాకు విరుగుడు గురించి ఉంది: గరికపాటి

Edited By:

Updated on: Apr 26, 2020 | 12:53 PM

భూమి మీద మానవాళితో పాటు మిగిలిన జీవులను వణికిస్తోన్న కరోనాకు మందును కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కొన్ని దేశాలు క్లినికల్ వ్యాక్సిన్‌ను కూడా ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతదేశంలోని యోగ వాశిష్ట్యంలో కరోనాకు విరుగుడు ఉందని ప్రముక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు.

కరోనాపై మాట్లాడిన ఆయన.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రస్తావన మన పురాణాల్లోనే ఉందని, దానికి సంబంధించి మందు ప్రస్తావన కూడా ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికైనా శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. యోగ వాశిష్ట్యం అనే గ్రంథంలో చంద్రుడికి సంబంధించిన అంశాల్లో కరోనాకు విరుగుడు గురించి ఉందని గరికపాటి తెలిపారు. దానిపై పరిశోధనలు జరిపితే విరుగుడు త్వరగా కనుగొనవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29 లక్షలకు దగ్గరగా ఉంది. 2లక్షల మంది ఈ మహమ్మారి వలన మృత్యువాతపడగా, 8లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకున్నారు.

Read This Story also: Breaking: ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 81 కేసులు..!