కరోనా వైరస్‌తో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కరోనా పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ ఉన్నట్లు రిపోర్టుల్లో వచ్చింది. దీంతో ఆయన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజక వర్గం నుంచి ఆయన 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కాగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు సీఎం కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల పలువురు సీపీఎం నాయకులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Read More: