Mewalal Choudhary: కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చౌదరి మృతి

|

Apr 19, 2021 | 11:40 AM

Mewalal Choudhary Death: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణ ప్రజల నుంచి

Mewalal Choudhary: కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చౌదరి మృతి
Mewalal Choudhary
Follow us on

Mewalal Choudhary Death: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా బీహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, అధికార జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌద‌రి క‌రోనావైరస్‌తో క‌న్నుమూశారు. గ‌త‌వారం క‌రోనాబారిన ప‌డిన మేవాలాల్.. పాట్నాలోని ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో సోమ‌వారం తెల్లవారుజామున 4 గంట‌ల‌కు మృతిచెందారు. ఆయ‌న ప్రస్తుతం తారాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా.. గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత‌ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మేవాలాల్ చౌద‌రి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు. అయితే ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో నెల‌రోజుల వ్యవధిలోనే మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు.

మాజీ మంత్రి మేవాలాల్ చౌద‌రి మరణం ప‌ట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ‌కీయాల్లో, విద్యారంగంలో ఆయ‌న లేని లోటును పూడ్చలేమంటూ నితీశ్ విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వ లాంఛ‌నాల‌తో మేవాలాల్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని బీహార్ ప్రభుత్వం ఆదివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. బీహార్‌లోని పాఠశాలలు, కళాశాలలను మే 15 వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్లో ప్రస్తుతం 39,498 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Corona: దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..

Remdesivir: ‘రెమిడెసివిర్‌’ను ఆ దేశం నుంచి తెచ్చుకుంటాం.. అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన జార్ఖాండ్ సీఎం