దేశంలో ఏవియేషన్ రంగానికి మరింత ప్రోత్సాహం

| Edited By: Pardhasaradhi Peri

May 16, 2020 | 5:56 PM

దేశంలో కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం నిర్ణయించిందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఈ పన్నెండు ఎయిర్ పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడులవల్ల అదనంగా 13 వేల కోట్లు రావచ్ఛునని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు పేయర్ల కోసం పీపీపీ భాగస్వామ్యంతో మరో ఆరు ఎయిర్ పోర్టులను వేలం వేయనున్నామని, దీనివల్ల ఏవియేషన్ రంగానికి ఏడాదికి సుమారు వెయ్యికోట్ల లాభం రావచ్చునని అన్నారు. భారత గగనతలంలో ఆంక్షలను సరళీకృతం చేస్తామని, ఇది సివిల్ ఏవియేషన్ రంగానికి ఊతమిచ్చినట్టు అవుతుందని […]

దేశంలో  ఏవియేషన్ రంగానికి మరింత ప్రోత్సాహం
Follow us on

దేశంలో కొత్తగా 12 విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం నిర్ణయించిందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఈ పన్నెండు ఎయిర్ పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడులవల్ల అదనంగా 13 వేల కోట్లు రావచ్ఛునని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు పేయర్ల కోసం పీపీపీ భాగస్వామ్యంతో మరో ఆరు ఎయిర్ పోర్టులను వేలం వేయనున్నామని, దీనివల్ల ఏవియేషన్ రంగానికి ఏడాదికి సుమారు వెయ్యికోట్ల లాభం రావచ్చునని అన్నారు. భారత గగనతలంలో ఆంక్షలను సరళీకృతం చేస్తామని, ఇది సివిల్ ఏవియేషన్ రంగానికి ఊతమిచ్చినట్టు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇకపై మన దేశంలోనే విమానాల మెయింటెనెన్స్, రిపేర్లు, ఓవర్ హాల్ జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఇది మిలిటరీ, సివిల్ విమానాలకు కూడా వర్తిస్తుందని ఆమె తెలిపారు. ఈ చర్యల వల్ల ప్రతి రెండేళ్లకు సుమారు 800 కోట్ల నుంచి 1200 కోట్ల రూపాయలవరకు ఆదా అవుతుందన్నారు. భారతీయ ఏరో స్పే స్ రూట్ల  హేతుబధ్ధీకరణ, విమానాశ్రయాల అభివృధ్దికి ఎయిర్ పోర్ట్ అథారిటీకి 2300 కోట్ల కేటాయింపులు ఉంటాయన్నారు.